![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -66 లో.....కిన్నెర దగ్గరున్న డైరీలో నుంచి పెద్దావిడ ఒక పేజీ చింపేసి పంతులికి ఇస్తుంది. పంతులు అందులో కుంకుమా పోస్తాడు. ఆ తర్వాత జాను హుండీలో డబ్బులు వేస్తుంటే ఎంతసేపు వేస్తావని జాను దగ్గర డబ్బు తీసుకొని సూర్య వేస్తాడు. దాంతో సూర్య చెయ్ అందులో ఇరుక్కుపోతుంది. జాను చెయ్ పట్టుకొని లాగుతుంది. కిన్నెర వచ్చి అక్క నిన్ను రమ్మంటున్నారని పిలుస్తుంది. ఆ తర్వాత నందుని మురళి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని పంతులు చెప్తాడు. నందు ఆశీర్వాదం తీసుకుంటుంది. పతిదేవా ఏమైనా ఆశీర్వదించావని నందు అడుగుతుంది. నువ్వు బాగుండాలని ఆశీర్వదించానని మురళి అంటాడు.
ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు చిటకెన వేలు పట్టుకొని హోమం చుట్టూ తిరుగుతారు. నందు తాళికి కుంకుమ పెట్టుకోమని పెద్దావిడ అంటుంది. పేపర్ లో ఉన్న కుంకుమ తీసుకొని వెళ్లి నందు దగ్గరికి వెళ్తుంది. మురళి కుంకుమ తీసుకొని నందు తాళి కి పెడతాడు. జానూ అప్పుడే పేపర్ లో ఏమో ఉందని చదువుతుంది. ఇది నాన్న రాసింది.. ఎక్కడ నుంచి తీశారు అని జాను అడుగుతుంది. అది మొన్న నాన్న నా గురించి ఏమైనా రాసి ఉంటాడా అని బ్యాగ్ నుంచి తీసానని కిన్నెర చెప్తుంది. ఆ డైరీ తీసుకొని జాను చదువుతుంది. అందులో సింహాద్రికి మొత్తం డబ్బు ముట్టాయని సింహాద్రికి ఎంత పంపించాడో మొత్తం రాసి ఉంటుంది. అది చూసి జాను షాక్ అవుతుంది. మరొకవైపు సింహాద్రి ఇంటికి భువన వస్తుంది. అప్పుడే సింహాద్రి తోట గురించి మాట్లాడతాడు. శంకర్ తోటకి పూర్తిగా డబ్బు ఇవ్వలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు తోటకి బేరం పెట్టాను.. వాళ్ళు డబ్బు ఇస్తే శంకర్ కుటుంబానికి ఇస్తానని భువనతో మంచివాడిలాగా సింహాద్రి యాక్టింగ్ చేస్తాడు.
ఆ తర్వాత సింహాద్రి ఇంటికి సూర్యని తీసుకొని జాను వస్తుంది. సింహాద్రి రా బయటకు అని అనగానే అందరు బయటకు వస్తారు. ఎంత మోసం చేసావ్ మా నాన్న చావుకి కారణం నువ్వే.. తోటకి మొత్తం డబ్బు కట్టాడు.. నువ్వు మోసం చేసావని జాను అంటుంటే.. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ మా అన్నయ్య మీ కోసం కష్టపడుతున్నాడు.. ఏదో డైరీపై రాసుంటే అలా మాట్లాడుతావా ఆ డైరిలో నువ్వు రాసావో ఎవరు రాసారో తెలియదు కదా అని భువన కోపంగా డైరీని విసిరేస్తుంది. ఆ డైరి వెళ్లి మంటలో పడి కాలిపోతుంది. డైరీ అని అందులో నుంచి తియ్యబోతుంటే సూర్య ఆగు జాను అంటాడు. అమ్మ నువ్వు తప్పు చేసావ్ ఎందుకు అలా విసిరావని సూర్య అంటాడు. నాకేం తెలుసు అందులో పడిపోతుందని భువన అంటుంది. నీకేం తెలియదని సూర్యని భువన లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత జాను దగ్గరికి సింహాద్రి వచ్చి నేను తోట విషయంలో మోసం చేసానే అనుకో.. ఇప్పుడు ఏం చేస్తావ్ తోట అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులు విసిరేస్తాను తీసుకొని వెళ్ళమని సింహాద్రి తన అసలు రంగు బయట పెడుతాడు. అది చూసి జాను షాక్ అవుతుంది. తరువాయి భాగంలో ఎందుకు అలా మాట్లాడావని జానూపై శారద కోప్పడుతుంది. దాంతో సింహాద్రి గురించి జాను మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |